కువైట్ : సహకార సంఘాల ద్వారా సరుకుల అమ్మకాలు..ఐడీ చూపిస్తేనే సరుకులు

- March 28, 2020 , by Maagulf
కువైట్ : సహకార సంఘాల ద్వారా సరుకుల అమ్మకాలు..ఐడీ చూపిస్తేనే సరుకులు

ఇక నుంచి ప్రజలకు కావాల్సిన సరుకులను ఆయా ప్రాంతాల సహకార సంఘాల ద్వారా అమ్మాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం శుక్రవారం రాత్రి నుంచే అమల్లోకి వచ్చింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ నిబంధనలను అమలు చేస్తున్నట్లు కువైట్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఖలెద్ అల్ రౌద్దన్ వెల్లడించారు. అయితే..ఆయా సహకార సంఘాల పరిధిలోకి వచ్చే పౌరులు, నివాసితులకు మాత్రమే సరుకులు అమ్మాలని కూడా షరతులు విధించింది. నిత్యావసర వస్తువులు కావాల్సిన వాళ్లు తాము ఏ సహకార సంఘం పరిధిలోకి వస్తారో అక్కడికి తమ గుర్తింపు కార్డు తీసుకొని వెళ్లాలని సూచించింది. తమ పరిధిలోకి రానివారికి ఎట్టిపరిస్థితులోను సరుకులు అమ్మకూడదని కూడా సొసైటీలకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు..సాధారణంగా తీసుకున్నట్లు ఎక్కువ మొత్తంలో సరుకులు అమ్మకూడదని, కొనుగోలు దారులు తమకు కావాల్సిన సరుకుల కొలతను తగ్గించుకోవాలని కూడా సూచించింది. ఇదిలాఉంటే కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో సామాగ్రి కొనేందుకు ప్రజలు గుమికూడవద్దని, సామాజిక దూరం పాటించాలని ఖలేద్ కోరారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com