ఒమన్ : కరోనాపై పోరాటానికి విరాళాల కోసం ప్రత్యేక బ్యాంక్ అకౌంట్లు

- March 28, 2020 , by Maagulf
ఒమన్ : కరోనాపై పోరాటానికి విరాళాల కోసం ప్రత్యేక బ్యాంక్ అకౌంట్లు

ప్రపంచ దేశాలు ఇప్పుడు మహా విపత్తును ఎదుర్కొంటున్నాయి. కంటికి కనిపించని శత్రువుతో అతి భయంకరమైన యుద్ధం జరుగుతోంది. ప్రపంచ మానవాళిని కబలిస్తున్న వైరస్ పోరాటానికి ప్రతి ఒక్కరు సైనికుడిలా నిలబడాల్సిన తరుణమిది. కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు మీరు మద్దతుగా నిలబడాలనుకుంటున్నారా? అయితే..మీ తోచిన విరాళాలు ఇచ్చి ప్రభుత్వానికి, కరోనా బాధితులకు అండగా ఉండాలని కోరుతోంది ఒమన్ ప్రభుత్వం. కరోనా బాధితులకు అవసరమైన వైద్యం అందించేందుకు, వైద్య పరికరాలు, కిట్లు సమకూర్చుకునేందుకు ఆర్ధిక సాయం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విరాళాలు ఇవ్వాలనుకునే వారు డబ్బును తాము సూచించిన బ్యాంకు అకౌంట్లో జమ చేయాలని ఒమన్ ప్రభుత్వం సూచించింది. ఇందుకోసం నాలుగు బ్యాంక్ అకౌంట్ల వివరాలను ప్రకటించింది. కింద ఇచ్చిన అకౌంట్లో దాతలు నగదు జమ చేయవచ్చు.
* బ్యాంక్ మస్కట్ అకౌంట్ నెంబర్ : 0423057947840019
* నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ అకౌంట్ నెంబర్: 10840319012001
*బ్యాంక్ దోఫర్ అకౌంట్ నెంబర్: 01041388677001
*ఒమన్ అరబ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్: 3160500500500

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com