అమ్మకందారులూ నిబంధనల్ని ఉల్లంఘించొద్దు
- January 25, 2016
దిగుమతిదారులు, అమ్మకందారులు ఆహార పదార్థాల అమ్మకం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నిబంధనల్ని అతిక్రమించి, ఆహార పదార్థాల్ని (ప్యాకేజింగ్, నాన్ ప్యాకేజింగ్) విక్రయించడం ద్వారా కొనుగోలుదారుల ఆరోగ్యానికి హాని కల్గిస్తే కఠిన చర్యలకు గురవ్వాల్సి వస్తుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ (పిఎసిపి) వర్గాలు ఈ మేరకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశాయి. ఇటీవల ఇద్దరు వ్యక్తులు నిబంధనల్ని ఉల్లంఘించి ఆహార పదార్థాల అమ్మకాలు జరిపినందుకు కఠినంగా శిక్షింపబడ్డారు. వారిలో ఒకరికి మూడు నెలల జైలు శిక్ష, 30,000 ఒమర్ రియాల్స్ ఫైన్ విధించారు. చట్టాల ప్రకారం 2 వేల రియాల్స్ నుంచి 50,000 రియాల్స్ వరకూ ఫైన్, అలాగే 3 నెలల నుంచి 3 ఏళ్ళ వరకు జైలు శిక్ష నిబంధనల్ని ఉల్లంఘించినవారికి తప్పదు. ప్యాకేజీలపై తప్పుడు సమాచారం, భద్రత లేని ఆహార పదార్థాల అమ్మకం వంటివి తీవ్ర నేరాలుగా పరిగణింపబడతాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







