మదీనా: 6 మదీనా జిల్లాల్లో కర్ఫ్యూ పొడగింపు

- March 29, 2020 , by Maagulf
మదీనా: 6 మదీనా జిల్లాల్లో కర్ఫ్యూ పొడగింపు

కరోనా వైరస్ కట్టడికి మదీనా ప్రిన్సిపాలిటీ తమ పరిధిలోని ప్రాంతాలపై ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. ఆరు జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది. శనివారం ఉదయం ఆరు గంటల నుంచే కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. అయితే..వ్యాధి విస్తరణ తీవ్రతను బట్టి కర్ఫ్యూ గడువును పొడగించాలా లేదా అనేది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం అల్ షురయ్ బాత్, బని జుఫ్ర్, ఖుర్బాన్, అల్ జుమా జిల్లాలతో పాటు ఇస్కాన్, బని కుద్ర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూని అమలు చేస్తున్నారు. కరోనా వ్యాప్తిని నివారించేందుకు ఆయా ఆరు జిల్లాల నుంచి ప్రజలు బయటికి వెళ్లకూడదని, అలాగే ఇతరులను జిల్లాలోకి అనుమతించకూడదని ప్రిన్సిపాలిటీ అధికారులు సూచించారు. అందరూ తప్పనిసరిగా స్వీయ నిర్బంధంలోనే ఉండాలని హెచ్చరించారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నట్లైతే 937 కి కాల్ చేయాలని తెలిపారు. అయితే..నిత్యావసర సరుకులు, మెడిసిన్ కొనేందుకు మాత్రం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అనుమతించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com