తెలుగు సినీ కార్మికుల సంక్షేమం కోసం హీరో శర్వానంద్ రూ. 15 లక్షల విరాళం
- March 29, 2020
హీరో శర్వానంద్ ఆదివారం ఉదయం 11 గంటలకు తొలిసారిగా 'ఐయామ్ శర్వానంద్' అనే ట్విట్టర్ అకౌంట్‌తో సోషల్ మీడియాలో అడుగుపెట్టారు. దినసరి వేతనంతో పనిచేసే కార్మికులు సినిమా సెట్లపై అందరికంటే ఎక్కువగా కష్టపడుతుంటారని పేర్కొన్న ఆయన, షూటింగ్‌లు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తెలుగు సినీ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన 'కరోనా క్రైసిస్ చారిటీ'కి రూ. 15 లక్షలు విరాళం ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను తప్పనిసరిగా పాటిస్తూ, అందరూ తమ ఇళ్లల్లోనూ సురక్షితంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలు, వైద్యులు ఎప్పటికప్పుడు అందిస్తున్న సలహాలు, సూచనలను పాటించి ఆరోగ్యంగా ఉండాలని శర్వానంద్ కోరారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..