స్పెయిన్ యువరాణి మరియా థెరిసా మృతి
- March 29, 2020
మాడ్రిడ్:ప్రపంచాన్ని కబలించేస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవ్వరిని వదలడం లేదు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 30 వేల మందిని బలి తీసుకున్న కరోనా దెబ్బతో ఆదివారం స్పెయిన్ యువరాణి మరియా థెరిసా (86) మృతి చెందారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారీస్‌లో యువరాణి మారియా థెరిసా మృతి చెందినట్టు ఆమె కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఇక ఇప్పటికే స్పెయిన్‌లో కరోనా విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే.
యూరప్‌లో కరోనా కోరలు చాస్తోన్న దేశాల్లో స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్ ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు కేవలం సామాన్యులను బలి తీసుకున్నాయి.ఇక యూరప్‌లో ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాల్లో ఎక్కువ కరోనా మరణాలు చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం ఆ దేశల్లో ఉన్న వృద్ధులే అంటున్నారు. అప్పటికే అనేక అనారోగ్య సమస్యలతో ఉన్న వృద్ధులకు కరోనా సోకడంతో ఎక్కువ మంది చనిపోతున్నారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..