ఆన్లైన్లో 4800 మందుల వివరాలు
- January 25, 2016
సుప్రీం కౌన్సిల్ ఆఫ్ హెల్త్ (ఎస్‌సిహెచ్), తాజాగా ఖతార్ నేషనల్ ఫార్ములరీ (క్యుఎన్ఎఫ్) అనే ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ని ఫిజీషియన్స్, క్లినికల్ స్టాఫ్ మరియు పబ్లిక్ యాక్సెస్ చేసుకునేలా అందుబాటులోకి తెచ్చింది. దేశంలో అందుబాటులో ఉన్న మందుల వివరాలు ఇందులో పేర్కొంటారు. డాక్టర్లు రాసే మందులపై ప్రజలు అవగాహన పెంచుకోవడానికీ, అలాగే డాక్టర్లకూ కొత్తగా వస్తున్న మందులపై అవగాహన కలిగించుకోవడానికి, మందుల వినియోగంలో క్లినికల్ స్టాఫ్ రోగికీ, డాక్టర్‌కీ మధ్య సహాయ సహకారాలు అందించడానికీ ఈ పోర్టల్ ఉపయోగపడ్తుందని నిర్వాహకులు చెప్పారు. అయితే ఈ విధానం ద్వారా డాక్టర్ల కన్సల్టేషన్ అవసరం లేదనే భావన ప్రజల్లో ఉండకూడదు. కేవలం అవగాహన కోసమే మందుల వివరాల్ని ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







