భారత్ లో 10 శాతం తగ్గిన కరోనా కేసులు
- March 30, 2020
ప్రపంచమంతా శరవేగంగా వ్యాపిస్తున్న కవిడ్-19 , మన భారతదేశంలో కూడా వీరవిహారం చేస్తోంది. ఈ మహమ్మారి నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక ప్రజలు భయంతో అల్లాడిపోతున్నారు. వారికి ఊరట కలిగిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ ఒక మంచి వార్తను అందించింది. ప్రస్తుతం మన దేశంలో మొత్తం 1024 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, వాటిలో 96 కేసులు రికవరీ అయ్యాయి. కొన్ని కేసుల్లో పేషెంట్లను డిశ్చార్జి కూడా చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా కరోనా నుండి బయటపడిన ఏడుగురిని రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని తెలిపింది. దీని వల్ల రికవరీ సంఖ్య ఇంకా పెరుగుతుంది. నిజంగా ఈ వార్త ఎంతో మందికి ఆనందాన్ని కలిగిస్తోంది.
ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, కరోనా వైరస్ సోకిన వారిలో 82 శాతం మంది రికవరీ అవుతున్నారు. మిగతా 18 శాతం మంది చనిపోతున్నారు. కానీ మన దేశంలో మాత్రం మరణాల సంఖ్య చాలా తక్కువగానే ఉంది. మన దేశంలో అంతగా వైద్య సదుపాయాలు లేనప్పటికీ, ఈ కరోనా రక్కసి నుంచి ప్రజలను కాపాడడానికి మన డాక్టర్లు, నర్సులూ, వైద్య సిబ్బంది చాలా కృషి చేస్తున్నారు. ఇదిలా ఉండగా లాక్డౌన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల, జిల్లాల సరిహద్దులనూ మూసేయాలని ఆదేశించింది. అంతే కాకుండా, లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చెయ్యాలని ప్రకటించింది. వచ్చే రెండు వారాల్లో కేసుల రికవరీ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయట.
తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలా చేస్తే ఏప్రిల్ 7 తర్వాత తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసు ఉండబోదని ఆయన పేర్కొన్నారు. కొన్ని రోజులుగా చాలా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పరుగుతూ, రికవరీ అయ్యే కేసుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. దీని వల్ల వైరస్ను పూర్తిగా కంట్రోల్ చెయ్యగలమనే నమ్మకం డాక్టర్లకు కలుగుతోంది. మున్ముందు కూడా ఇలాగే పటిష్ట చర్యలు తీసుకుంటే, కరోనా మహమ్మారి మన దేశాన్నివదిలిపోతుందని వారు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు