'తెలుగు కళా స్రవంతి, అబుధాబి' అధ్వర్యంలో 'సంక్రాంతి సంబరాలు'
- January 25, 2016
అబుధాబి లోని తెలుగు కళా స్రవంతి వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఉదయం 9గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి 600 మందికి పైగా మంది కుటుంబాలతో సహా హాజరయ్యారు.మొదటగా సంక్రాంతి విశిష్టతను తెలుగు భాష గొప్పతనాన్ని వివరిస్తూ 38 తెలుగు బడి పిల్లల కార్యక్రమం అందరిని ఆకట్టుకుంది. తర్వత అబూధాబి మహిళలు గొబ్బిమ్మలు పేర్చి పాటలతో హోరెత్తించారు,ఆ వెంటనే వనిత సంస్థ ద్వార ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా అబుధాబి అతివలు బృందాలుగా ఏర్పడి ఆకర్షనీయమైన ముగ్గులు వేశారు.తర్వాత పిల్లల ఆటల పోటీలు,పురుషుల కబడ్డీ,స్త్రీల ఖోఖో పోటీలు నిర్వహించారు.సాంప్రదాయ తెలుగు వంటకాలతో భోజన కర్యక్రమం ముగించుకొని తర్వాత పిల్లలకు భోగిపళ్ల కార్యక్రమం నిర్వహించారు.చివరాగ తెలుగు క్యాలెండరు,బహుమతుల పంపిణి,లక్కి బహుమతుల పంపిణితో కార్యక్రమం ముగిసింది.తెలుగు కళా స్రవంతికి చెందిన 25 కో-ఆర్డినేటర్స్ ఈ కార్యక్రమాన్ని కలసికట్టుగా జయప్రదం చేసారు.
మాగల్ఫ్ టీం తరుపున 'తెలుగు కళా స్రవంతి' వారికి అభినంధనులు









తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







