కరోనా/యూఏఈ: 2021 కు వాయిదా పడనున్న ఎక్స్పో 2020
- March 30, 2020
దుబాయ్: కరోనా మహమ్మారికి ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్న సంగతి చూస్తున్నాం. కరోనా ధాటికి ఇప్పటికే టోక్యో లో జరగాల్సిన ఒలింపిక్స్ వాయిదాపడ్డ సంగతి విదితమే. దుబాయ్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న అతిపెద్ద ఈవెంట్ 'Expo 2020'. దీనికి గాను దుబాయ్ ఎంతో వ్యయప్రయాసలకు లోనై ప్రపంచపు అతిపెద్ద ఎక్స్పో గా తీర్చిదిద్దెందుకు సర్వ సన్నాహాలు చేస్తోంది. ఇప్పుడు దుబాయ్ చేపడుతున్న ఈ Expo కి ఎదురుదెబ్బ కరోనా రూపంలో ఎదురైంది.
ఈరోజు సాయంత్రం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో కరోనా వ్యాపించకుండా కట్టడి చేసేందుకు ఈ ఎక్స్పో ను ఒక సంవత్సరం పాటు వాయిదావేయాలని యూఏఈ కి ఇతర దేశాలు సిఫారసు చేశాయి. ఈ ప్రతిపాదనకు యూఏఈ తన మద్దతు ప్రకటించింది, కానీ, పాలకమండలి కొన్ని ప్రక్రియలను అనుసరించి జనరల్ అసెంబ్లీ నుండి మూడింట రెండు వంతుల మెజారిటీ ఓటు పొందిన తర్వాతే ఎక్స్పో వాయిదాపై తుది నిర్ణయం ఉంటుంది అని యూఏఈ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!