'చుట్టాలబ్బాయి' తాజా షెడ్యూల్ జనవరి 29న
- January 25, 2016
లవ్‌లీ రాక్‌స్టార్ ఆది హీరోగా ఎస్.ఆర్.టి. మూవీ హౌస్ మరియు శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్ పతాకాలపై వీరభద్రమ్ దర్శకత్వంలో రాము తాళ్ళూరి, వెంకట్ తలారి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'చుట్టాలబ్బాయి'. ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్ జనవరి 29 నుంచి బ్యాంకాక్‌లో ప్రారంభం కానుంది.ఈ సందర్భంగా నిర్మాతలు రాము తాళ్ళూరి, వెంకట్ తలారి మాట్లాడుతూ - "జనవరి 29 నుంచి బ్యాంకాక్‌లో స్టార్ట్ చేస్తున్న తాజా షెడ్యూల్‌లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్‌ని శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వంలో చిత్రీకరించడం జరుగుతుంది. పాటతోపాటు కొన్ని సీన్స్‌ని కూడా షూట్ చెయ్యబోతున్నాం. దీని తర్వాత ఫిబ్రవరి 18 నుంచి హైదరాబాద్‌లో షూటింగ్ వుంటుంది.మార్చి 2 నుంచి 20 రోజులపాటు రాజమండ్రిలో జరిగే షెడ్యూల్‌తో టోటల్‌గా షూటింగ్ పార్ట్‌పూర్తవుతుంది" అన్నారు.దర్శకుడు వీరభద్రమ్ మాట్లాడుతూ - "మా 'చుట్టాలబ్బాయి' ఆల్‌మోస్ట్ ఫస్ట్ హాఫ్ షూటింగ్ పూర్తయిపోయింది. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం కోసం థమన్ చాలా ఎక్స్‌ట్రార్డినరీ ట్యూన్స్ ఇచ్చాడు. ఈ సినిమా తప్పకుండా నాకు, ఆదికి మంచి సూపర్‌హిట్ సినిమా అవుతుంది" అన్నారు.లవ్‌లీ రాక్‌స్టార్ ఆది, నమిత ప్రమోద్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, పృథ్వి, రఘుబాబు, అభిమన్యు సింగ్, సురేఖావాణి, షకలక శంకర్, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, గిరిధర్, దువ్వాసి మోహన్, తాగుబోతు రమేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.థమన్, సినిమాటోగ్రఫీ: ఎస్.అరుణ్‌కుమార్, ఆర్ట్: నాగేంద్ర, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, మాటలు: భవాని ప్రసాద్, స్టిల్స్: గుణకర్, నిర్మాతలు: రాము తాళ్ళూరి, వెంకట్ తలారి, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: వీరభద్రమ్.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు









