కువైట్:ఆన్ లైన్ విద్య ఆప్షన్ మాత్రమే..10 రోజుల్లో తుది నిర్ణయం
- April 01, 2020
కువైట్:పబ్లిక్, ప్రైవేట్ విద్య విషయంలో మరో పది రోజుల్లోనే తమ తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని కువైట్ విద్యాశాఖ మంత్రి డాక్టర్ సౌద్ అల్ హర్బి వెల్లడించారు. తమ నిర్ణయాన్ని పది రోజుల్లో పార్లమెంటరీ అండ్ కల్చర్ కమిటీకి నివేదిస్తామని కూడా ఆయన తెలిపారు. అయితే విద్యా పురోగతి మాత్రం ఎట్టి పరిస్థితి ఆగిపోకుండా చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు. స్పీకర్ మర్జఖ్ అల్ గనిమ్ ఆధ్వర్యంలో పార్లమెంటరీ కమిటీతో జరిగిన సమావశం తర్వాత విద్యాశాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ విద్య విధానాని అవాంతరాలు లేకుండా అన్ని అంశాలపై చర్చించామని అన్నారు. అయితే..ఆన్ లైన్ లో విద్య అందించటం అనేది ఒక అప్షన్ మాత్రమేనని అని కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటున్నామని, అయినా ఆలస్యం చేయకుండా విద్యా విధానంపై ఎదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..