కరోనా ఎఫెక్ట్:అబుధాబిలో సరుకుల రవాణాకు ఉచిత ట్యాక్సీ..రిటైలర్లకు ఊరట
- April 01, 2020
అబుధాబి మున్సిపాలిటీ రిటైల్ షాపు ఓనర్లకు ఊరటనిచ్చేలా ఉచిత ట్యాక్సీలు అందిస్తోంది. ఆన్ లైన్ ఆర్డర్స్ మేరకు రిటైలర్స్ తమ సరుకులను మున్సిపాలిటీ ట్యాక్సీల ద్వారా ఇక నుంచి ఉచితంగా హోమ్ డెలివరీ చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు. 600535353 ద్వారా రిజిస్టర్ చేసుకున్న రిటైలర్లు ట్యాక్సీ యాప్ ద్వారా అబుధాబి మున్సిపాలిటీ సమకూర్చే వాహనాలను వాడుకోవచ్చని తెలిపారు. అంతేకాకుండా...తాము అందిస్తున్న ట్యాక్సీ డ్రైవర్స్ కి కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పిస్తున్నామని కూడా చెప్పారు. వినియోగదారులకు సరుకులు సరఫరా చేసే సమయంలో డ్రైవర్లు విధిగా మాస్కులు, హ్యాండ్ గ్లౌజులు ధరించటంతో పాటు ఇత శానిటైజ్ విధానాలను కూడా పాటించేలా శిక్షణ కూడా ఇచ్చామని తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఇటీవల ఆన్ లైన్ ఆర్డర్స్ విపరీతంగా పెరిగిపోయిన సంగతి తెలిసింది. దీంతో వినియోగదారులు అందరికీ తమ సొంత వాహనాల్లో సరుకుల రవాణా చేయటంలో రిటైలర్లు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. పైగా సరుకుల సరఫరా ఆలస్యంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అబుదాబి మున్సిపాలిటీ రవాణా విభాగం ఉచితంగా ట్యాక్సీలను అందిస్తోంది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం