ఏపీలో కరోనా కలకలం..

- April 01, 2020 , by Maagulf
ఏపీలో కరోనా కలకలం..

ఏపీ:ఏపీలో కరోనా విజృంభిస్తోంది. నిన్న ఒక్క రోజే పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకంగా 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఒక్కసారిగా రాష్ట్రము అలెర్ట్ అయ్యింది. కాగా 14 మంది బాధితుల్లో ఏలూరులో 8 మంది, భీమవరంలో రెండు ఇద్దరు, ఉండి , గుండుగోలను, నారాయణపురం, పెనుగొండల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా భారిన పడ్డారు. వీరంతా ఢిల్లీ లోని జమైతా ఇస్లామిక్ సభలకు వెళ్లి వచ్చిన వారే కావడం విశేషం. అయితే వీరిలో ఎవరికీ కరోనా లక్షణాలు కనిపించలేదు. ఢిల్లీ వెళ్లి వచ్చారనే అనుమానంతో పరీక్షలు నిర్వహించగా వారికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ ఘటనతో పశ్చిమ గోదావరిలో రెడ్ అలర్ట్ ప్రకటించే అవకాశం ఉంది. కాగా అధికారులు వారి బంధువులను ఇప్పటికే ఐసోలేషన్ కు తరలించారు. వారు ఎవరెవరిని కలిశారు అని వెతికే పనిలో అధికారులు ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com