'ఆర్జీవీ' చిత్ర టైటిల్ లోగో విడుదల
- April 01, 2020
కార్తికేయ చిత్రనిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం మరియు టారస్ సినికార్ప్ సమర్పణలో, ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకత్వంలో, మాగ్నస్ సినీప్రైమ్ పతాకంపై బాల కుటుంబరావు పొన్నూరి నిర్మిస్తున్న 'ఆర్జీవీ' చిత్ర టైటిల్ లోగో విడుదల మరియు చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ది 02-04-2020న మీడియా వారికి విడుదల చేయడం జరిగింది, ఈ సందర్భంగా దర్శకులు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ 'తా చెడ్డకోతి వనమెల్లా చెరిచినట్లు' తన పిచ్చి ఇజంతో యువతను పెడత్రోవ పట్టిస్తున్న ఒక వ్యక్తి ఫిలాసోఫి మీద సంధించిన రామబాణమే ఈ సినిమా అని, అందుకే "శ్రీరామనవమి" పర్వదినాన ఈ చిత్ర టైటిల్ లోగో విడుదల చెయ్యడం జరిగిందని తెలిపారు. చిత్ర సమర్పకులు వెంకట శ్రీనివాస్ బొగ్గరం మాట్లాడుతూ, కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిన వెంటనే చిత్రీకరణ ప్రారంభిస్తామని, సామాజిక బాధ్యత లేని ఒక కుహనా మేధావి ఐడియాలజీ సమాజాన్ని ఎలా కలుషితం చేస్తుందో తెలిపేదే ఈ సినిమా అని చెప్పారు.
నటీనట వర్గం: సురేష్, రాశి, శ్రద్ధా దాస్, అమిత్, పునర్నవి భూపాలం, తేజ తదితరులు.
సాంకేతికనిపుణులు:
ఛాయాగ్రహణం : వేదాంత్ మల్లాది
కూర్పు : కార్తీక శ్రీనివాస్
కళ : కృష్ణ చిత్తనూర్
పబ్లిసిటీ : ధనీ ఏలే
సంగీతం : వీణాపాణి
సమర్పణ : వెంకట శ్రీనివాస్ బొగ్గరం
నిర్మాత : బాల కుటుంబ రావు పొన్నూరి
కధ, మాటలు, పాటలు, చిత్రానువాదం మరియు దర్శకత్వం : జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!







