చైనాలో కరోనా వైరస్ వ్యాక్సిన్ రెడీ..
- April 01, 2020
బీజింగ్:మహమ్మారి కరోనా వైరస్‌ను అరికట్టేందుకు సిద్దం చేస్తున్న వ్యాక్సిన్‌కు విదేశాల్లో ట్రయిల్స్ నిర్వహించాలని చైనా ఆలోచిస్తోంది. ప్రస్తుతం ఆ దేశంలోని వుహన్ నగరంలో ఈ వ్యాక్సిన్‌పై పరీక్షలు నిర్వహిస్తుండగా.. అవి పూర్తిగా సురక్షితం, విజయవంతం అయితే.. ఇకపై విదేశాల్లో ట్రయిల్స్ చేసేందుకు యోచిస్తున్నట్లు చైనా పరిశోధకులు పేర్కొన్నారు.
అక్కడి ప్రభుత్వం అనుమతితో ఈ వ్యాక్సిన్‌కు తొలిదశ ట్రయిల్స్ ను వుహన్ లో మార్చి 16న మొదలుపెట్టారు. ఇది సజావుగా సాగుతోందని, దీని ఫలితాలు ఏప్రిల్‌లో విడుదల చేస్తామని చైనీస్ అకాడమీ అఫ్ ఇంజనీరింగ్ సభ్యుడు చెన్ వీ తెలిపారు. ఇక చైనాలో ఉండే విదేశీయులపై కూడా ప్రయోగిస్తామన్నారు.
వూహాన్‌లో పురుడుపోసుకున్న కరోనా వైరస్ అక్కడి ప్రజలను రెండు నెలల పాటు గడగడలాడించింది. పాజిటివ్ కేసులు తగ్గడంతో ప్రస్తుతం అక్కడి పరిస్థితులు మళ్ళీ సాధారణ స్థితికి వచ్చాయి. 'ప్రారంభ ఫలితాల్లో వ్యాక్సిన్ సురక్షితం అని నిరూపణ అయ్యి.. మంచి ప్రభావాన్ని చూపిస్తే.. అంతర్జాతీయ దేశాల సాయంతో విదేశాల్లో కూడా దీనిపై ట్రయిల్స్ నిర్వహిస్తామని చెన్ తెలిపినట్లు అక్కడి ప్రభుత్వ పత్రిక తెలియజేశారు . కరోనా ప్రభావిత దేశాల్లో ఈ వ్యాక్సిన్ ను తొందర్లోనే వాడొచ్చని చెన్ అన్నారు. అంటు వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు అంతర్జాతీయ దేశాలకు సహకరించేందుకు తాను, తన టీం ఎలప్పుడూ సిద్దంగా ఉన్నామని ఆమె వెల్లడించింది. ఉన్నట్టు చెన్ తెలిపారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..