వి విల్ స్టే ఎట్ హోమ్.. వి స్టే సేఫ్--కీరవాణి
- April 01, 2020అటు ప్రభుత్వాలకు ఇటు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది కరోనా వైరస్(కోవిడ్-19) . ఈ మహమ్మారిపై పోరాటంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక మంది సెలబ్రెటీలు అండగా నిలుస్తున్నారు. పలువురు ఆర్థిక సహాయం చేస్తుండగా మరికొందరు ఈ వైరస్‌పై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేలా పలు వినూత్న ప్రయత్నాలకు తెరదీస్తున్నారు. ఇప్పటికే కరోనా వైరస్‌పై చౌరస్తా బ్యాండ్, సంగీత దర్శకుడు కోటి అందించిన పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి 'వి విల్ స్టే ఎట్ హోమ్.. వి స్టే సేఫ్' అనే పాటను స్వయంగా రాసి, ట్యూన్ చేసి ఆలపించారు.
'అదిగో పులి అంటే ఇదిగో తోక అని బెదరకండి.. విందులు వినోదాలు కాస్త మానుకోండి.. బతికుంటే బలుసాకు తినగలమని తెలుసుకోండి', 'ఇళ్లు ఒళ్లు మనసు శుభ్ర పరుచుకుంటే ఇలలోనే ఆస్వర్గాన్నే చూడొచ్చండి..ఇష్ట దేవతల్ని కాస్త తలచుకుంటే, ఏ కష్టమైనా అవలీలగా దాటొచ్చండి' అనే లిరిక్స్ ప్రజల్లో చైతన్యంతో పాటు మనోధైర్యాన్ని తీసుకొస్తున్నాయి. కాగా, ఈ పాట కోసం ఆయన గతంలో 'స్టూడెంట్ నెం. 1' సినిమాకి కంపోజ్ చేసిన 'ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి' పాట ట్యూన్‌నే మళ్లీ తీసుకున్నారు. ఇక గతంలో కూడా కరచాలనం కంటే చేతులెత్తి నమస్కారం చేయడం ఎంత మంచిదో వివరిస్తూ ఓ పద్యాన్ని ఆలపించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు