కువైట్:రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘులకు నేటి నుంచే క్షమాభిక్ష..
- April 01, 2020
కువైట్:రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘించిన వారికి క్షమాభిక్ష అమలు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది. ఎలాంటి జరిమాన చెల్లించకుండానే రెసిడెన్సీ ఉల్లంఘులు తమ దేశాలకు వెళ్లొచ్చు. ఏప్రిల్ 30 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఫైన్ రద్దుతో పాటు సొంత దేశాలకు వెళ్లే వారికి ఉచితంగా విమాన ప్రయాణ సదుపాయం కూడా కల్పిస్తోంది కువైట్ ప్రభుత్వం. ఈ నెల రోజుల వ్యవధిలో దాదాపు రెండు లక్షల మంది రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘులను వారి సొంత దేశాలకు తరలించాలని
లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అనుకునే వారు దేశాల వారీగా కేటాయించిన నిర్దిష్ట తేదీల్లో ఫర్వానియాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాలకు రావాలని అధికారులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారు పురుషులు అయితే ఫర్వానియా గవర్నరేట్ ప్రాంతంలోని అల్ ముత్తన్న ప్రైమరీ బాయ్స్ స్కూల్, బ్లాక్ 1, స్ట్రీట్ 122 కేంద్రంలో పేరు నమోదు చేసుకోవాలి. అలాగే మహిళల కోసం ఫర్వానియా గవర్నరేట్ ప్రాంతంలోని ఫర్వానియా ప్రైమరీ స్కూల్, బ్లాక్ 1, స్ట్రీట్ 76 లో కేంద్రం ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వారంలో ఏ రోజైనా తమ పేర్లను రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంటుంది.
దేశాల వారీగా ఫర్వానియా ప్రత్యేక కేంద్రాలను సంప్రదించి ప్రయాణం చేయాల్సిన తేదీలు :
ఫిలిప్పిన్స్ : ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 5 వరకు
ఈజిప్టియన్ : ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 10 వరకు
ఇండియా : ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 15 వరకు
బంగ్లాదేశ్ : ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 20 వరకు
శ్రీలంక : ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 25 వరకు
ఇతర దేశస్తులు : ఏప్రిల్ 26 నుంచి ఏప్రిల్ 30 వరకు
కువైట్ ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకోదలిచిన వారు సివిల్ ఐడీ, పాస్ పోర్టులను విధిగా తమతో తెచుకోవాలి. వాలిడ్ పాస్ పోర్టు లేని వారు ఎమర్జెన్సీ సర్టిఫికెట్ తీసుకురావాలి. ఆయా దేశాల రాయబార కార్యాలయ ప్రతినిధులు కూడా ఫర్వానియాలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే అందుబాటులో ఉంటారు. దీంతో సొంత దేశాలకు వెళ్లేవారు మళ్లీ ప్రత్యేకంగా ఆయా దేశాల రాయబార కార్యాలయాలను సంప్రదించాల్సిన అవసరం లేదు. అంతేకాదు సొంత దేశాలకు వెళ్లేందుకు ఫర్వానియాలోని కేంద్రాలను సంప్రదించిన తర్వాత వారు ప్రయాణ తేదీ వరకు ఉండేలా వసతి ఏర్పాట్లను కూడా చేసినట్లు అధికారులు తెలిపారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?