కరోనా ఎఫెక్ట్:పార్కింగ్ ఫీజును రద్దు చేసిన మస్కట్ మున్సిపాలిటీ

కరోనా ఎఫెక్ట్:పార్కింగ్ ఫీజును రద్దు చేసిన మస్కట్ మున్సిపాలిటీ

మస్కట్:కరోనా వైరస్ కారణంగా నెలకొన్న విపత్తు నేపథ్యంలో మస్కట్ మున్సిపాలిటీ ప్రజలకు ఊరటనిచ్చే మరో నిర్ణయం తీసుకుంది. మస్కట్ మున్సిపాలిటీ పరిధిలో ఇక నుంచి పార్కింగ్ ఫీజులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రస్తుత ఆదేశాలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ పరిస్థితుల కారణంగా ఈ వెసులుబాటు కల్పించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అలాగే ఈ క్లిష్ట సమయంలో ప్రజలు అందరూ ఇళ్లలోనే ఉండి సురక్షితంగా ఉండాలని మున్సిపాలిటీ అధికారులు కోరారు. 

--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,మస్కట్)

Back to Top