కరోనా ఎఫెక్ట్:2 నెలలు ఫ్రీగా ఇంటర్నెట్ వీడియో,వాయిస్ కాల్స్...

కరోనా ఎఫెక్ట్:2 నెలలు ఫ్రీగా ఇంటర్నెట్ వీడియో,వాయిస్ కాల్స్...

యూఏఈ:యూఏఈలోని తమ వినియోగదారులకు ఎటిసలాట్ టెలి కమ్యూనికేషన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రెండు నెలల పాటు ఉచితంగా ఇంటర్నెట్ కాలింగ్ ద్వారా వీడియో,వాయిస్ కాల్స్ అందించనుంది. కరోనా వైరస్ నేపథ్యంలో స్టే హోంకు మద్దుతగా యూఏఈ రెసిడెంట్స్ కు ఈ ఆఫర్ ప్రకటించినట్లు ఎటిసలాట్ తెలిపింది. నెలవారి ఇంటర్నెట్ ప్లాన్ సబ్ స్క్రైబ్ చేసుకున్న వారికి ఏప్రిల్, మే నెలలో ఉచిత ఇంటర్నెట్ కాలింగ్ ప్లాన్  తో పాటు వాయిస్ కాల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఎటిసలాట్ ఉచిత ఆఫర్ కోసం ICP అని టైప్ చేసి 1012 నెంబర్ కు ఎస్ఎంఎస్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కంపెనీ నుంచి మెసేజ్ రాగానే ఉచిత ఇంటర్నెట్ వీడియో, వాయిస్ కాల్స్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. అయితే..ఇదివరకే ఎటిసలాట్ వినియోగదారులు అయి ఉండి నెలవారి ఇంటర్నెట్ ప్లాన్స్ ను యాక్టివేట్ చేసుకొని ఉంటే ముందుగా అమలులో ఉన్న ప్లాన్ ను డీయాక్టీవ్ చేయించుకోవాలి. ఆ తర్వాత మళ్లీ  సబ్ స్క్రైబ్ చేసుకోవటం ద్వారా ఆఫర్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది.ఎటిసలాట్ ఇంటర్నెట్ కాలింగ్ ప్లాన్ ద్వారా వీడియో,వాయిస్ కాల్స్ కొరకు ఈ యాప్స్BOTIM, HiU, Voico UAE and C'Me ని ఉపయోగించుకోవచ్చు.

 

Back to Top