దోహా: నిర్భంధంలో ఉన్న కార్మికులకు పూర్తి జీతం..

దోహా: నిర్భంధంలో ఉన్న కార్మికులకు పూర్తి జీతం..

దోహా:కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ఖతార్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే..డెవలప్మెంట్ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆయా రంగాల్లో పని చేస్తున్న కార్మికుల ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు సమాచారం అందించేలా హట్ లైన్(92727) ఏర్పాటు చేసిన ఖతార్ ప్రభుత్వం...కరోనా లక్షణాలతో నిర్బంధ శిబిరాలకు వెళ్లాల్సి వచ్చే కార్మికులకు ఊరటనిస్తూ మరో ప్రకటన వెలువరించింది. నిర్బంధంలో ఉన్న కాలానికి సంబంధించి జీతంలో కోత విధించకూడదని కార్మిక, సాంఘిక సంక్షేమ పరిపాలన మంత్రిత్వ శాఖ ఆయా రంగాలకు సూచించింది. పూర్తి జీతం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.

ఇదిలాఉంటే..కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠినంగా ఉంటామని హెచ్చరించిన ఖతార్ అధికారులు ఆ దిశగా చర్యలు కూడా చేపట్టారు. సౌతర్న్ ఖతార్ లో ఒకే చోట గుమికూడిన పది మందిని అరెస్ట్ చేశారు. లాక్ డౌన్ కాలం ముగిసే వరకు ఎవరు ఒకే చోట గుమికూడవద్దని మరోసారి హెచ్చరించారు. 

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Back to Top