కరోనా ఎఫెక్ట్:2 నెలలు ఫ్రీగా ఇంటర్నెట్ వీడియో,వాయిస్ కాల్స్...
- April 01, 2020యూఏఈ:యూఏఈలోని తమ వినియోగదారులకు ఎటిసలాట్ టెలి కమ్యూనికేషన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రెండు నెలల పాటు ఉచితంగా ఇంటర్నెట్ కాలింగ్ ద్వారా వీడియో,వాయిస్ కాల్స్ అందించనుంది. కరోనా వైరస్ నేపథ్యంలో స్టే హోంకు మద్దుతగా యూఏఈ రెసిడెంట్స్ కు ఈ ఆఫర్ ప్రకటించినట్లు ఎటిసలాట్ తెలిపింది. నెలవారి ఇంటర్నెట్ ప్లాన్ సబ్ స్క్రైబ్ చేసుకున్న వారికి ఏప్రిల్, మే నెలలో ఉచిత ఇంటర్నెట్ కాలింగ్ ప్లాన్ తో పాటు వాయిస్ కాల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఎటిసలాట్ ఉచిత ఆఫర్ కోసం ICP అని టైప్ చేసి 1012 నెంబర్ కు ఎస్ఎంఎస్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కంపెనీ నుంచి మెసేజ్ రాగానే ఉచిత ఇంటర్నెట్ వీడియో, వాయిస్ కాల్స్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. అయితే..ఇదివరకే ఎటిసలాట్ వినియోగదారులు అయి ఉండి నెలవారి ఇంటర్నెట్ ప్లాన్స్ ను యాక్టివేట్ చేసుకొని ఉంటే ముందుగా అమలులో ఉన్న ప్లాన్ ను డీయాక్టీవ్ చేయించుకోవాలి. ఆ తర్వాత మళ్లీ సబ్ స్క్రైబ్ చేసుకోవటం ద్వారా ఆఫర్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది.ఎటిసలాట్ ఇంటర్నెట్ కాలింగ్ ప్లాన్ ద్వారా వీడియో,వాయిస్ కాల్స్ కొరకు ఈ యాప్స్BOTIM, HiU, Voico UAE and C'Me ని ఉపయోగించుకోవచ్చు.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..