కరోనా వైరస్:టర్మ్ 3 బస్సు ఫీజులు తిరిగి ఇచ్చేయండి..
- April 02, 2020
దుబాయ్:దుబాయ్ లోని అన్ని స్కూల్స్ తల్లిదండ్రుల దగ్గర్నుంచి వసూలు చేసిన టర్మ్ 3 బస్సు ఫీజులను తిరిగి ఇచ్చేయాలని విజ్ఞాణ, మానవ వనరుల అభివృద్ధి అధికారులు ఆదేశించారు. కరోనా వైరస్ కారణంగా కొంత కాలంగా అన్ని స్కూల్స్ మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విద్యార్ధుల తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి ఎదురైంది. తమ పిల్లలు ఇంట్లో ఉండే చదువుకుంటున్నారు కనుక బస్సు ఫీజులను మినహాయించాలని కొద్ది రోజులుగా కోరుతున్నారు. తల్లిదండ్రుల వినతిని పరిశీలించిన KHDA టర్మ్ 3 బస్సు ఫీజులను తిరిగి పేరెంట్స్‌కు ఇచ్చేయాలని నిర్ణయించింది. అలాగే ఇండియా, పాకిస్తాన్ స్కూల్స్ ఏప్రిల్ 5 నుంచి మొదలయ్యే అకాడమిక్ ఇయర్ కు సంబంధించి టర్మ్ 1 బస్సు ఫీజులను వసూలు చేస్తే వాటిని కూడా తల్లిదండ్రులకు వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్‌కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్‌లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







