తెలంగాణలో మరో 27 కరోనా కేసులు

- April 02, 2020 , by Maagulf
తెలంగాణలో మరో 27 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణలో గురువారం మరో 27 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా సోకినవారి సంఖ్య 154కు చేరింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ రోజు కరోనా బారి నుంచి కోలుకున్న ముగ్గురు డిశ్చార్జ్‌ అయినట్టుగా తెలిపింది. దీంతో ఇప్పటివరకు డిశ్చార్జ్‌ అయినవారి సంఖ్య 17కు చేరింది. తెలంగాణలో ఇప్పటివరకు కరోనా సోకి 9 మంది మృతిచెందినట్టుగా పేర్కొంది. ప్రస్తుతం 128 మంది కరోనా పేషెంట్లకు చికిత్స కొనసాగుతుందని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com