అమెరికాలోని భారతీయులకి చేదువార్త ...!!!!
- April 03, 2020
అమెరికాలో శాశ్వత నివాసం పొందాలంటే గ్రీన్ కార్డ్ తప్పని సరి అనే విషయం ప్రతీ వలస వాసులకి తెలిసిందే. అంతేకాదు ఈ గ్రీన్ కార్డ్ కోసం లక్షలాది మంది వలస వాసులు ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు. ఇలా ఎదురు చూస్తున్న వారిలో అత్యధికులు భారతీయులే. అయితే ఈ సంఖ్య 2030 నాటికి మరింత రెట్టింపు అవుతుందని భారతీయులు దశాభ్దాల పాటు గ్రీన్ కార్డ్ కోసం నిరీక్షించాల్సి వస్తుందని అంటోంది సిఆర్ఎస్.
కాంగ్రేషనల్ రీసర్చ్ సర్వీస్ నివేదిక ప్రకారం. ఇప్పటి వారకూ గ్రీన్ కార్డ్ ఆమోదం పొంది వేచి ఉన్న వారి సంఖ్య ఇప్పటికే 10 లక్షలుగా ఉంది. అయితే ప్రస్తుత చట్టం ప్రకారం మూడేళ్ళ కి ఒక్కో పరిమితిని తొలిగించి విదేశీ నిపుణులకి గ్రీన్ కార్డ్ రిజర్వ్ చేసి ఉంచుతారు. ఈ క్రమంలోనే ఉపాధి ఆధారంగా ఈబీ -1 ఈబీ -2 , ఈబీ -3 వర్గాలకి జరీ చేసే గ్రీన్ కార్డ్ ల సంఖ్య ని 1,20,120 కి పెంచారు. అయితే తాజాగా సవరించిన చట్టాల ప్రకారం భారత్ చైనాకి కాల పరిమితి తగ్గనుంది. దాంతో ఈబీ1 బ్యాక్ లాగ్ సంఖ్య 1,19,732 నుంచీ ,2,68,246కి పెరగనుంది అయితే ఇది 2030 కి జరగనున్న ప్రక్రియ. ఇక ఈబీ2 వారి సంఖ్య 6,27,448 నుంచీ 14,71,360 కు అలాగే ఈబీ3 వారి సంఖ్య 1,68,317 నుంచీ 4,56,190 కి పెరగనుంది. ఈ మూడు వర్గాల వారి సంఖ్య 2030 నాటికి భారీగా పెరగనుందని అంటున్నారు నిపుణులు. ఈ లెక్కల పరంగా చూస్తే గ్రీన్ కార్డ్ పొందటం భారతీయులకి దశాభ్దా కాలం పట్టడం ఖాయమని అంటోంది సిఆర్ఎస్.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?