మర్కజ్ ఎఫెక్ట్: 960 మంది విదేశీయుల వీసాలు రద్దు..
- April 03, 2020
ఢిల్లీ:భారత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించి ఢిల్లీలోని తబ్లీగీ జమాత్‌లో పాల్గొని..దేశంలో కరోనా వ్యాప్తికి కారణమైన 960 మంది విదేశీలయుల వీసాలను రద్దు చేసింది. 'హోం మంత్రిత్వ శాఖ 960 మంది విదేశీయులను బ్లాక్ లిస్ట్ చేసింది. పర్యాటక వీసాలపై వచ్చి తబ్లిఘి జమాత్ కార్యకలాపాలలో పాల్గొన్నందుకు వారి భారత వీసాలు కూడా రద్దు చేయబడ్డాయి' అని హోంమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.
విదేశీయుల చట్టం 1946.. విపత్తు నిర్వహణ చట్టం 2005 లోని సంబంధిత సెక్షన్లు ఉల్లంఘించిన వారందరిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డీజీపీలను.. ఢిల్లీ పోలీసు కమిషనర్‌ను కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఢిల్లీలోని నిజాముద్దీన్ లో ప్రార్థనల్లో పాల్గొన్న అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ సహా పలు దేశాలకు చెందిన 1,300 మంది విదేశీ తబ్లిగి జమాత్ కార్యకర్తలు దేశంలోని వివిధ ప్రాంతాలలో గుర్తించబడ్డారని, వారిలో ఎక్కువ మందిని ఉంచినట్లు అధికారులు గురువారం తెలిపారు .
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు