కరోనా ఎఫెక్ట్: ప్రవాసీయులు యూఏఈకి రావాలంటే మరో 2 వారాలు ఆగాల్సిందే..!
- April 03, 2020
యూఏఈ:విదేశాల్లో ఉన్న యూఏఈ వీసా హోల్డర్స్ తిరిగి యూఏఈ చేరుకునేందుకు మరికొన్నాళ్లు వేచి ఉండాల్సిందే. కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే విదేశాల్లో ఉన్న ప్రవాసీయుల రాకను రెండు వారాల పాటు రద్దు చేస్తున్నట్లు యూఏఈ ప్రకటించింది. అంతర్జాతీయ సహాకర, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. యూఏఈ రెసిడెన్స్ వీసాదారులు ఇప్పటికే విదేశాల్లో ఉన్నా లేదంటే వారి సొంత దేశాల్లో ఉన్నా..అక్కడ్నుంచి యూఏఈకి రావాలంటే మరో రెండు వారాల తర్వాతే అనుమతిస్తామని విదేశాంగ శాఖ పేర్కొంది. కరోనా మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రెసిడెంట్స్ కి తమ ప్రకటనలో వివరించింది. అయితే..అత్యవసరంగా యూఏఈ రావాలనుకునే వారు మాత్రం ఇటీవలె ప్రారంభించిన తవజుది ఫర్ రెసిడెంట్స్ సేవలను వినియోగించుకొని తమ పేర్లను ఈ క్రింద ఇచ్చిన లింకు లో నమోదు చేసుకోవాలని విదేశాంగ శాఖ సూచించింది.
లింకు: https://www.mofaic.gov.ae/en/services/twajudi-resident
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







