అమెరికాలో కరోనాతో ఒక్కరోజులో 1169 మంది మృతి.!
- April 03, 2020అమెరికాలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా కేవలం 24 గంటల వ్యవధిలో 1,169 మంది కరోనా బాధితులు తుది శ్వాశ విడిచారు. ప్రపంచంలోని ఏ దేశంలోనూ కరోనా కారణంగా ఒక్కరోజులో ఇన్ని మరణాలు సంభవించలేదు. ఈ మేరకు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ట్రాకర్ ద్వారా గురువారం వెల్లడైంది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8:30 గంటల నుంచి గురువారం రాత్రి 8:30 గంటల మధ్య ఈ మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అమెరికాలో మొత్తంగా 6,095 మంది మృత్యువాత పడినట్లు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. అంతేకాకుండా దేశంలో మొత్తం 2,45,380 కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటివరకు నమోదుకాగా.. వాటిలో 503 కేసులు కొత్తగా నమోదైనవి.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!