కరోనా ఎఫెక్ట్:ఏప్రిల్ 4న జాతీయ సంతాప దినంగా ప్రకటించిన చైనా
- April 03, 2020
బీజింగ్:కరోనా మహమ్మారికి బలైన వారికి సంతాపం తెలిపేందుకు ఏప్రిల్ 4న జాతీయ సంతాప దినం పాటించాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వలన ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ లీ వెన్లీయాంగ్‌తోపాటు 3,300 మందికి పైగా చైనీయులకు శనివారం సంతాపం తెలియజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. శనివారం చైనాతోపాటు విదేశాల్లోని అన్ని చైనా రాయబార కార్యాలయాల్లో జాతీయ జెండాలను అవనతం చేసి ఉంచుతారు.
దీంతో శనివారం దేశంలో అన్ని ప్రజా వినోద కార్యక్రమాలను రద్దు చేశామని సర్కారు ప్రకటించింది. శనివారం ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా ప్రజలు మూడు నిమిషాలు మౌనం పాటించి.. కరోనా మృతులకు సంతాపం తెలుపుతారు. ఈ సందర్భంగా విమానాలు, బస్సులు, రైళ్లు, ఓడల్లో సంతాపసూచకంగా సైరన్ మోగించనున్నారు.
తాజా వార్తలు
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!