యూఏఈ:స్టెరిలైజేషన్ సమయంలో రోడ్ల మీదకు వచ్చి కెమెరాకు చిక్కిన 9000 మోటరిస్టులు
- April 04, 2020
కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో వైరస్ ను కట్టడి చేసేందుకు యూఏఈ జాతీయ స్టెరిజైలేషన్ ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే..స్టెరిలైజేషన్(రసాయాలతో శుభ్రపరచటం) సమయంలో ఎవరూ ఇళ్ల నుంచి రావొద్దని అధికారులు ముందస్తుగానే హెచ్చరించారు. అయితే..అధికారుల హెచ్చరికలను పట్టించుకోకుండా దాదాపు 9000 మంది మోటరిస్టులు రోడ్ల మీదకు వచ్చినట్లు షార్జా పోలీసులు తెలిపారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రోడ్ల మీద తిరిగిన వాహనదారులు అంతా సీసీ కెమెరాకు చిక్కారని...ఇక వాళ్లపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. స్టెరిలైజేషన్ సమయాల్లో చాలా మంది అధికారుల సూచనలను పాటించారని తెలిపారు.
ఇదిలాఉంటే..ఏప్రిల్ 1 తర్వాత ట్రాఫిక్స్ నిబంధనలు పాటించకుండా విధించి జరిమానాలపై 50 శాతం తగ్గింపు ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే మార్చి 31 నాటి జరిమానాలను రద్దు చేస్తున్నట్లు షార్జా ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ డైరెక్టర్ తెలిపారు. అయితే..తగ్గింపు డబ్బు మూడు నెలలకు వాయిదా తర్వాత పునరుద్ధరింప బడుతుందని కూడా స్పష్టం చేశారు. అంతేకాదు..వాహనాలపై బ్లాక్ పాయింట్స్ రద్దు చేయటంతో పాటు.. సీజ్ చేసిన వాహనాలను విడిచిపెడతామని వెల్లడించారు. జరిమానాల తగ్గింపు ఆటోమాటిక్ గా అప్ డేట్ అవుతుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు