కరోనా అలర్ట్:భారత విదేశాంగ శాఖ మంత్రితో ఫోన్ లో మాట్లాడిన కువైట్ విదేశాంగ శాఖ మంత్రి

- April 04, 2020 , by Maagulf
కరోనా అలర్ట్:భారత విదేశాంగ శాఖ మంత్రితో ఫోన్ లో మాట్లాడిన కువైట్ విదేశాంగ శాఖ మంత్రి

కువైట్:భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తో కువైట్ విదేశాంగ శాఖ మంత్రి షేక్ డాక్టర్ అహ్మద్ నాస్సెర్ అల్ మొహమ్మద్ అల్ సబ ఫోన్ లో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి నేపథ్యంలో దాన్ని అరికట్టే దిశగా పరస్పర చర్యలు చేపట్టే అంశాలపై వీరిద్దరు చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరానాన్ని మరింత బలపర్చుకోవటంపైనా చర్చించినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా తమ దేశంలో సరైన ధృవ పత్రాలు లేకుండా నివసిస్తున్న వారిని ప్రత్యేక విమానాల్లో వారి సొంత దేశాలకు తరలిస్తున్న విషయం తెలిసిందే. తొలిదశలో ఫిలిఫ్పీన్స్ దేశస్తులను తరలింపు ప్రక్రియ ప్రారంభం అవగా..ఏప్రిల్ 11 నుంచి 15 వరకు భారతకు చెందిన వారిని తరలిస్తోంది. ఈ నేపథ్యంలోనే కువైట్ విదేశాంగ శాఖ మంత్రి..భారత విదేశాంగ శాఖ మంత్రికి ఫోన్ చేసి మాట్లాడారు. ఇదిలాఉంటే..కరోనా వ్యాప్తి కట్టడిపై గత బుధవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ, కువైట్ ప్రధాని శేఖ్ ఖాలీద్ అల్ సబకు ఫోన్ చేసిన విషయం తెలిసిందే. వైరస్ పై పోరాటానికి ఇరు దేశాలు పరస్పర సహకరించుకునే అంశంపై ఇరు దేశాల ప్రధానులు చర్చించారు. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com