ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ని ప్రారంభించిన NPRA

- April 04, 2020 , by Maagulf
ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ని ప్రారంభించిన NPRA

మనామా:నేషనాలిటీ, పాస్‌పోర్ట్స్‌ అండ్‌ రెసిడెన్స్‌ ఎఫైర్స్‌ (NPRA), NPRA వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ సర్వీసుల్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. అవసరమైన క్వాలిటీ మేరకు అప్లికేషన్ల ప్రాసెసింగ్‌ని వేగవంతం చేయడం ఈ ఫెసిలిటీ ఉద్దేశ్యం. ఇ-సర్వీసెస్‌ బ్యాక్‌ అప్‌ ఇంక్వైరీస్‌ కోసం కాంటాక్ట్‌ సెంటర్‌ని కూడా ఏర్పాటు చేశారు. ఆదివారం నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుంది. వీసాల జారీ, ఎక్స్‌టెన్షన్‌, క్యాన్సెలేషన్‌ అలాగే లోకల్‌ ట్రాన్స్‌ఫర్‌, రెసిడెన్స్‌ పర్మిట్‌ జారీ అలాగే రద్దు వంటి సర్వీసులు ఈ ఆన్‌లైన్‌ విధానంతో అందుబాటులో వుంటాయి. పాస్‌పోర్టుల జారీ అలాగే పోగొట్టుకున్న లేదా పాడైపోయిన పాస్‌పోర్టుల రీప్లేస్‌మెంట్‌ కూడా ఈ విధానంలో పొందుపర్చారు. పాస్‌పోర్టులు ఇసా టౌన్‌ సర్వీస్‌ సెంటర్‌ నుంచి అందుకోవచ్చు. 17399764 నెంబర్‌కి కాల్‌ చేసి లేదా ఎన్‌పిఆర్‌ఎ వెబ్‌సైట్‌ని సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com