నిజామాబాద్:ఒక్కరోజే 16 కరోనా పాజిటీవ్ కేసులు
- April 04, 2020
తెలంగాణ:భారత దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ కరోనా వ్యాప్తిని మాత్రం అరికట్టలేక పోతున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. తెలంగాణలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. నిజామాబాద్‌లో శుక్రవారం ఒక్కరోజే 16 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఢిల్లీలో జరిగిన తబ్లిగ్ జమాత్ కార్యక్రమానికి హాజరైన యూపీకి చెందిన పలువురు సభ్యులకు కరోనా వైరస్ సోకడంతో వారిని క్వారంటైన్‌కు తరలించిన విషయం తెలిసిందే.
అయితే మరికొంత మంది ఇంకా తప్పించుకుని తిరుగుతున్నారని వారి అంతట వారే లొంగిపోయి వైద్య చికిత్స చేయించుకోవాలని పోలీసులు.. వైద్య నిపుణులు అంటున్నారు. ఇదిలా ఉంటే.. జిల్లా కలెక్టర్ శుక్రవారం నాడు ఒక ప్రకటన విడుదల చేస్తూ గురువారం నాడు పంపిన 42 శాంపుల్స్ లో 41 మందివి పరీక్షల నివేదికలు వచ్చాయని అందులో 16 గురికి కరోనా వైరస్ సోకినట్లు నివేదికల ద్వారా తెలుస్తుందని అన్నారు. ఇంకా 25 మందికి నెగటివ్ వచ్చిందని మరొకరి నివేదిక పెండింగ్ లో ఉందని తెలిపారు.
పాజిటివ్ వచ్చిన వారిని తదుపరి వైద్య చికిత్సలకు గాంధీ ఆసుపత్రి కి పంపిస్తున్నామని నెగిటివ్ వచ్చిన 25 మందిని తదుపరి పర్యవేక్షణకు కొన్ని రోజులపాటు ప్రభుత్వ క్వారంటైన్ లో ఉంచడానికి ఆదేశాలు జారీ చేశామన్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని.. కరోనాని కట్టడి చేయడానికి ప్రజలు తమ వంతు కృషి చేయాలని అన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు