ఏపీలో వారికి పూర్తి జీతాలు

- April 04, 2020 , by Maagulf
ఏపీలో వారికి పూర్తి జీతాలు

అమరావతి: కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా అత్యవసర సేవలందిస్తోన్న  వైద్యారోగ్యశాఖ, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మూడు కేటగిరీలకు చెందిన ఉద్యోగులకు పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించాల్సిందిగా ఆర్థికశాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. 
వాస్తవానికి రాష్ట్రంలో అఖిలభారత సర్వీసు అధికారులకు 60శాతం మేర, ప్రభుత్వ ఉద్యోగులందరికీ 50శాతం మేర, నాలుగోతరగతి ఉద్యోగులకు 10శాతం మేర జీతాలను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అత్యవసర సేవల విభాగాలుగా ఈ శాఖలకు చెందిన ఉద్యోగులు నిరంతరం శ్రమిస్తున్నందున వీరికి పూర్తిస్థాయిలో జీతాలు చెల్లించాల్సిందిగా సీఎం ఆదేశించారు. కొవిడ్‌-19 నివారణ చర్యలపై సమీక్షించిన సీఎం  ఈ సూచనలు చేశారు. కరోనా వైరస్‌ నివారణకు వారు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఈ మూడు కేటగిరీలకు సిబ్బందికి పూర్తి జీతాలు చెల్లించాలని,  ఈమేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com