దుబాయ్:సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం..ప్రవాసీయుడి అరెస్ట్
- April 04, 2020
దుబాయ్:సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి పాల్పడిన ఓ ప్రవాసీయుడిని దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వీడియోను ఉన్నది ఉన్నట్లుగా కాకుండా తనకు అనుకూలంగా ఎడిట్ చేసి అపోహలు కలిగించేలా నిందితుడు షేర్ చేశాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. ప్రజలు భయాందోళనకు గురి చేసేలా అసత్య ప్రచారం చేసినందుకు అతన్ని అరెస్ట్ చేసినట్లు వివరించారు. సోషల్ మీడియా వేదికగా ఎవరైనా సమాజానికి హాని కలిగించే, ఇబ్బంది కలిగించేలా ప్రచారం చేసినా, ఫేక్ వీడియోస్ షేర్ చేసినా ఫెడరల్ లా ఆర్టికల్ 198 ప్రకారం నేరం అవుతుందని గుర్తు చేశారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో అలాంటి అసత్య ప్రచారాలను అసలు సహించబోమని కూడా హెచ్చరించారు. ఎవరైనా అపోహలు, అసత్య ప్రచారాలు చేసినట్లు తమ దృష్టికి వస్తే దుబాయ్ పోలీస్ యాప్ లోని పోలీస్ ఐ సర్వీస్ ద్వారాగానీ, E-crime.ae ద్వారా తమకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!