సీసీసీకి రూ.5 లక్షలు అందజేసిన మైత్రీ మూవీ మేకర్స్..
- April 04, 2020
కరోనా వైరస్‌పై పోరాటంలో భాగమవుతూ ఇదివరకే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయనిధులకు చెరొక రూ. 10 లక్షల చొప్పున రూ. 20 లక్షలను విరాళంగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ అందజేశారు. తాజాగా శనివారం కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి మరో రూ. 5 లక్షలను వారు అందజేశారు. ఈ విషయాన్ని నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ తమ సంస్థ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. "రూ. 20 లక్షలకు అదనంగా.. లాక్‌డౌన్ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లు లేక ఉపాధి కోల్పోయిన పేద కళాకారులు, కార్మికులను ఆదుకోవడం కోసం చిరంజీవి గారు ఏర్పాటుచేసిన కరోనా క్రైసిస్ చారిటీకి కూడా మేం రూ. 5 లక్షలు విరాళంగా అందజేస్తున్నాం. కరోనా మహమ్మారిపై పోరాటంలో మేం చేతులు కలుపుతున్నాం. ఈ విషయంలో అందరం ఒక్కటవుదాం. ఇంట్లో ఉండండి.. జీవితాలను కాపాడుకోండి" అని వారు ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!







