మనామ:శానిటైజర్లను ఎక్కువ ధరలకు అమ్ముతున్న ఫార్మసీ షాపు మూసివేత

- April 05, 2020 , by Maagulf
మనామ:శానిటైజర్లను ఎక్కువ ధరలకు అమ్ముతున్న ఫార్మసీ షాపు మూసివేత

మనామ:ప్రపంచమంతా కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు ముప్పుతిప్పలు పడుతుంటే..ఇదే అవకాశమన్నట్లు కొందరు ఫార్మా స్టోర్స్ నిర్వాహకులు కక్కుర్తి ప్రదర్శిస్తున్నారు. శానిటైజర్లు, మాస్కులు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలను దోపిడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా పెడచెవిన పెట్టిన ఓ ఫార్మా స్టోర్ పై పరిశ్రమ, వాణిజ్య, పర్యాటక మంత్రిత్వ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. శానిటైజర్లను ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్లు నిర్ధారణ కావటంతో రిఫ్ఫాలోని ఫార్మా షాపును మూసివేశారు. వినియోగదారుల భద్రతను ఉల్లంఘించిన నేరానికి షాపును క్లోజ్ చేసినట్లు అధికారులు నోటీస్ అంటించారు. 250 మిల్లీలీటర్ల శానిటైజర్ ధరను ఏకంగా 80 శాతం ఎక్కువ ధరకు అమ్ముతుండగా, 500 శానిటైజర్ ను రెట్టింపు ధరకు అమ్ముతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రజలకు చేయూతగా నిలబడాల్సిన ఈ సమయంలో ఎవరైనా ఫార్మా స్టోర్స్ నిర్వాహకులు, ఇతర దుకాణదారులు ప్రజలను దోచుకోవాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని మరోసారి హెచ్చరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com