మనామ:శానిటైజర్లను ఎక్కువ ధరలకు అమ్ముతున్న ఫార్మసీ షాపు మూసివేత
- April 05, 2020
మనామ:ప్రపంచమంతా కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు ముప్పుతిప్పలు పడుతుంటే..ఇదే అవకాశమన్నట్లు కొందరు ఫార్మా స్టోర్స్ నిర్వాహకులు కక్కుర్తి ప్రదర్శిస్తున్నారు. శానిటైజర్లు, మాస్కులు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలను దోపిడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా పెడచెవిన పెట్టిన ఓ ఫార్మా స్టోర్ పై పరిశ్రమ, వాణిజ్య, పర్యాటక మంత్రిత్వ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. శానిటైజర్లను ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్లు నిర్ధారణ కావటంతో రిఫ్ఫాలోని ఫార్మా షాపును మూసివేశారు. వినియోగదారుల భద్రతను ఉల్లంఘించిన నేరానికి షాపును క్లోజ్ చేసినట్లు అధికారులు నోటీస్ అంటించారు. 250 మిల్లీలీటర్ల శానిటైజర్ ధరను ఏకంగా 80 శాతం ఎక్కువ ధరకు అమ్ముతుండగా, 500 శానిటైజర్ ను రెట్టింపు ధరకు అమ్ముతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రజలకు చేయూతగా నిలబడాల్సిన ఈ సమయంలో ఎవరైనా ఫార్మా స్టోర్స్ నిర్వాహకులు, ఇతర దుకాణదారులు ప్రజలను దోచుకోవాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని మరోసారి హెచ్చరించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్‌కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్‌లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







