భారత్‌లో 4000 దాటిన కరోనా కేసుల సంఖ్య

- April 06, 2020 , by Maagulf
భారత్‌లో 4000 దాటిన కరోనా కేసుల సంఖ్య

ఢిల్లీ: ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19 భారత్‌లో గంట గంటకూ తీవ్ర రూపం దాల్చుతోంది. గత 12 గంటల్లోనే దేశ వ్యాప్తంగా 490 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి కోవిడ్-19 బారిన పడిన వారి సంఖ్య 4067కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మహమ్మారి కారణంగా 109 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది. ప్రస్తుతం 292 మంది ఈ వ్యాధి నుంచి కోలుకోగా... మరో 3666 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 690 కరోనా కేసులతో మహారాష్ట్రా తొలిస్థానంలో ఉండగా, తమిళనాడు- 571, ఢిల్లీ- 503 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com