ఒమన్:పేరెంట్స్ కి ఊరటనిచ్చిన ఇండియన్ స్కూల్స్...జూలై వరకు ఫీజు పెంపు లేదు
- April 07, 2020
మస్కట్: ఒమన్లోని ఇండియన్ స్కూల్స్ యాజమాన్యం విద్యార్ధులకు గొప్ప ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. 2020-2021 విద్యా సంవత్సరానికి సంబంధించి జూలై 2020 వరకు ఎలాంటి ఫీజు పెంపు లేదని ప్రకటించింది. అంతేకాదు...ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో తల్లిదండ్రులపై ఆర్ధిక భారం పడకుండా ఫీజు వాయిదాల్లోనూ మార్పు చేసింది. గతంలో మూడు నెలలకు ఓ సారి ఫీజులు చెల్లించాల్సి వచ్చేది. అయితే..ఒకే సారి ఫీజు చెల్లించటం భారం అయ్యే అవకాశాలు ఉండటంతో నెలవారీగా ఫీజు చెల్లించే వెసులుబాటు కల్పించింది. కరోనా వైరస్ విలయం కారణంగా కొద్ది రోజులుగా లాక్ డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆర్ధిక ఒడిదుడుకులు ఎదురవుతున్న నేపథ్యంలో ఇండియన్ స్కూల్స్ మేనేజ్ మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?