కరోనాపై పోరాటం:స్టెరిలైజషన్ చర్యల షెడ్యూల్ ప్రకటించిన అబుధాబి
- April 07, 2020
అబుధాబి:కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు యూఏఈ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జాతీయ క్రిమిసంహారక చర్యలను కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో అబుధాబిలో శానిటైజేషన్ డ్రైవ్ సమయాలను ప్రకటించారు. అబుధాబి అధికార వర్గాలు వెల్లడించిన ప్రకటన మేరకు రాజధానిలోని నివాస ప్రాంతాల్లో క్రిమిసంహారక చర్యలు ప్రతీ రోజు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఇక పారిశ్రామిక ప్రాంతాలు, కార్మికులు ఉండే ప్రాంతాల్లో సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు స్టెరిలైజేషన్(క్రిమిసంహారక) చేస్తారు. రసాయనాల పిచికారి చేస్తున్నందువల్ల ఆయా సమాయాల్లో ప్రజలు ఇళ్లలోనే ఉండి తమకు సహకరించాలని అధికారులు కోరారు. మరో రెండు వారాల పాటు ప్రతీ రోజు ఈ స్టెరిలైజేషన్(క్రిమిసంహారక) ప్రక్రియ కొనసాగనుంది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?