వైరల్ అవుతున్న సినీ తారల షార్ట్ ఫిలిం..
- April 07, 2020
కరోనా వైరస్ ని పారద్రోలేందుకు అందరితో పాటు సినీ ప్రముఖులు కూడా తమ వంతు సహాయం చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తదితరులు కరోనా వైరస్ రాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోమని వీడియో రూపంలో అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. అలాగే కష్ట సమయంలో ఉన్న సినిమా కార్మికులకు చేదోడువాదోడుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, ప్రియాంక చోప్రా, ఆలియా భట్, ప్రొసంజిత్ ఛటర్జీ, శివ రాజకుమార్.. టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి, కోలీవుడ్ స్టార్ రజినీకాంత్, శాండల్ వుడ్ హీరో మమ్ముట్టి కలసి 4 నిమిషాల 35 సెకండ్ల నిడివిగల 'ది ఫ్యామిలీ' అనే ఓ షార్ట్ ఫిలిం తీశారు. ఈ షార్ట్ ఫిలిం సోనీ టీవీ లో సోమవారం రాత్రి 9 గంటలకు ప్రసారం అయింది.
'ది ఫ్యామిలీ' షార్ట్ ఫిలిం ప్రారంభం అవ్వగానే... అమితాబచ్చన్ ఎంట్రీ ఇచ్చి తన సన్ గ్లాస్సెస్ ఎక్కడున్నాయో వెతకమని చెబితే... ప్రొసంజిత్ ఛటర్జీ ఇంట్లో ఉన్న వారందరినీ అడుగుతుంటాడు. అప్పుడు వాష్ రూమ్ లో షేవింగ్ చేసుకుంటున్న చిరంజీవి మాట్లాడుతూ... 'ఏంటా కొట్టడం, తలుపు విరిగి పోగలదు. ఇంతకీ ఏం కావాలి?' అని అడగగా... అంకుల్ సన్ గ్లాస్సెస్( చలవ కళ్ళజోళ్ళు) కనిపించడం లేదు. బాత్రూం లో ఏమైనా ఉన్నదా' అని ఛటర్జీ ప్రశ్నించగా... చిరంజీవి సమాధానమిస్తూ... ' అరే బాత్రూం లో నీళ్ళే రావడం లేదు. ఇంకా సన్ గ్లాస్సెస్ ఎక్కడి నుంచి వస్తాయ్?' అని ఎదురు ప్రశ్న వేస్తారు. రజినీకాంత్, మమ్ముట్టి ఒక గదిలో కూర్చుని ఉంటే రణబీర్ కపూర్ వెళ్లి వారిని... 'అంకుల్ సన్ గ్లాస్సెస్ కనిపించడం లేదు. మీరు ఎక్కడైనా చూసారా అని అడిగితే... మమ్ముట్టి మాట్లాడుతూ అవి చాలా పాతబడిపోయాయి. వేరేవి కొనుక్కోమని చెప్తే... రజినీకాంత్ మాత్రం తమిళ్ లో మాట్లాడుతూ స్టైల్ గా తన కళ్ళజోడు మారుస్తూ... 'ఈ కళ్ళజోడా, లేకపోతే ఇదా' అంటూ షాక్ ఇస్తాడు. దాంతో మీరు మాట్లాడే భాష నాకేం అర్థం కావట్లేదు అని రణబీర్ కపూర్ అనుకుంటూ వెళ్ళిపోతాడు.
ఇలా సాగే ఈ షార్ట్ ఫిలిం లో అమితాబచ్చన్ చివర్లో మాట్లాడుతూ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఓ ఫ్యామిలీ లాంటిదని... లాక్ డౌన్ సమయంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్న సినీ కూలీలకు తామంతా సహాయం చేస్తున్నామని తెలిపారు. అలాగే కోవిడ్ 19 వ్యాధి భారతదేశంలో ప్రబలుతున్న వేళ... ప్రతి ఒక్కరూ ఇళ్ల నుండి బయటకు రాకుండా ఉంటే తమకి, తమ కుటుంబానికి, సమాజానికి మంచి జరుగుతుందని... భౌతిక దూరం పాటించడం చాలా ముఖ్యమని తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!







