కోవిడ్‌19పై పోరు: యూఏఈ వ్యాప్తంగా మెడిసిన్స్‌ హోమ్ డెలివరీ

- April 07, 2020 , by Maagulf
కోవిడ్‌19పై పోరు: యూఏఈ వ్యాప్తంగా మెడిసిన్స్‌ హోమ్ డెలివరీ

దుబాయ్‌ హెల్త్‌ అథారిటీ, దవాయీ మెడిసిన్‌ హోమ్ డెలివరీ సర్వీస్‌ని యూఏఈ మొత్తం విస్తరించినట్లు పేర్కొంది. వ్యాలీడ్‌ ఇనాయా లేదా సాదా హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌ ప్రోగ్రామ్ వున్న పెద్దవారు అలాగే పీపుల్‌ ఆఫ్‌ డిటర్మినేషన్‌కి మందుల్ని డెలివరీ చేయడం దవాయీ సర్వీస్‌ ముఖ్య ఉద్దేశ్యం. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో, రిస్కీ జోన్‌లో వున్నవారికి మందుల్ని ఇంటికే సరఫరా చేసేలా ఈ సర్వీసుని విస్తరించినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, దుబాయ్‌ హెల్త్‌ అథారిటీ గత డిసెంబర్‌లో ఈ సర్వీస్‌ని ప్రారంభించింది. స్పెషలైజ్డ్‌ ఫార్మసిస్ట్‌ ఆయా వ్యక్తుల ఇళ్ళకు వెళ్ళి, మెడికేషన్‌పై సలహాలు ఇస్తారు. తలాబత్‌ సాయంతో ఇప్పుడు ఈ సర్వీస్‌ని దుబాయ్‌కే పరిమితం కాకుండా మొత్తం యూఏఈకి విస్తరించారు. డిహెచ్‌ఎ ఫార్మాస్యూటికల్‌ సర్వీసెస్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అలీ అల్‌ సయ్యద్‌ మాట్లాడుతూ, వృద్ధులు అలాగే పీపుల్‌ ఆఫ్‌ డిట్మర్మినేషన్‌ కోసం ఇరవై నాలుగు గంటలూ మందుల సరఫరా చేయడం జరుగుతుందనీ, క్రిటికల్‌ మెడికల్‌ కండిషన్స్‌లో వున్నవారికీ ఇది వర్తిస్తుందని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com