కరోనా నుంచి కోలుకున్న 18 నెలల చిన్నారి
- April 07, 2020
ఒమన్:ఏడాదిన్నర (18 నెలలు) చిన్నారి, కరోనా వైరస్ బారిన పడి, పూర్తిగా కోలుకున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పేర్కొంది. రాయల్ హాస్పిటల్లో ఆ చిన్నారిని పిడియాట్రిక్ డిపార్ట్మెంట్లో చేర్పించి, వైద్య చికిత్స చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. తల్లిదండ్రుల నుంచి ఆ చిన్నారికి కరోనా వైరస్ సోకిందని వైద్యులు తెలిపారు. శ్వాస తీసుకోవడంలో చిన్నారికి ఇబ్బందులు తలెత్తాయనీ, ఈ నేపథ్యంలో రెండు రోజులపాటు చిన్నారిని అబ్జర్వేషన్లో వుంచామనీ, రేడియాలజీ టెస్టులు నిర్వహించడం జరిగిందనీ, అవసరమైన వైద్య సహాయం అందించడం జరిగిందనీ వైద్యులు వివరించారు. ‘చిన్నారి కరోనా వైరస్ నుంచి కోలుకున్నాడు. అతని ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడ్డాక ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేయడం జరుగుతుంది’ అని మినిస్ట్రీ వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది
- అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!
- కువైట్‌లో జూలై 16 నుంచి పెరగనున్న ఎండల తీవ్రత..!!
- యూఏఈ లాటరీ.. Dh50,000 చొప్పున బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- దోహా ఇండస్ట్రియల్ ఏరియాలో గోదాంలో అగ్నిప్రమాదం..!!
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!







