కోవిడ్ 19:ఖతార్ లో కార్మికులందరికీ ఉచిత చికిత్స
- April 08, 2020
దోహా:కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వివిధ రంగాల్లో పని చేస్తున్న కార్మికుల ఆరోగ్య భద్రతకు ఖతార్ లోని కార్మిక, సాంఘిక వ్యవహారాలు, కార్మిక అభివృద్ధి శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో కార్మికుల స్టేటస్ తో సంబంధం లేకుండా అందరికీ ఉచితంగా వైద్యం అందనుంది. కరోనా సంక్షోభం కారణంగా కార్మికులకు హెల్త్ కార్డు, ఖతార్ ఐడీ కార్డుతో సంబంధం లేకుండా వైరస్ నిర్ధారిత పరీక్షలతో పాటు ప్రభుత్వం ఉచితంగా చికిత్స అందిస్తుంది. కార్మికులు ఎవరికైనా కరోనా పాజిటీవ్ అని తేలితే వారిని ముకైనీస్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నిర్బంధ శిబిరానికి తరలిస్తారు. అక్కడే ఉచితంగా ట్రీట్మెంట్ అందిస్తారు. అంతేకాదు..ఏ కారణం చేతనైనా సరే నిర్బంధంలో ఉండాల్సి వస్తే ఆ కాలానికి జీతంలో కోత విధంచరు. నిర్బంధ కాలానికిగాను బేసిక్ శాలరీతో పాటు అలవెన్స్ లు యధాప్రకారం ఇస్తారు. సిక్ బెనిఫిట్స్ అన్నివర్తిస్తాయి. పని ప్రాంతంలోగానీ, అకామిడేషన్ దగ్గర గాని ఎవరైనా కార్మికుడు దగ్గు, జలుబు, జ్వరం, శ్వాసతీసుకోవటంలో ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తే మిగతా కార్మికులు వెంటనే అతని దూరంగా ఉండాలని, ఖతార్ కోవిడ్19 హాట్ లైన్ నెంబర్ 16000 ఫోన్ చేయాలని కూడా మంత్రిత్వ శాఖ తమ మార్గదర్శకాల్లో సూచించింది. ఎదైనా అత్యవసరంగా భావిస్తే ఆంబులెన్స్ కోసం 999కి కాల్ చేయాలని పేర్కొంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?