సౌదీలో 2 లక్షల మందికి కరోనా సోకే అవకాశాలు ఉంటాయని అంచనా
- April 08, 2020
రియాద్:ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 13 లక్షల మందిని బాధితులుగా మార్చిన కరోనా వైరస్ మరింత శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దాదాపు ప్రపంచ దేశాలన్నింటికి విస్తరించింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో వైరస్ ప్రభావం తమ దేశంపై ఎలా ఉండొచ్చని సౌదీ అరేబియా ఓ అంచనాకు వచ్చింది. వైరస్ పై అందిన నాలుగు నివేదికల ఆధారంగా రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 10 వేల మంది నుంచి 2 లక్షల మంది వైరస్ బారిన పడొచ్చని అంచనా వేస్తోంది. అందుకు తగినట్లుగా దేశంలోని పాలన వ్యవస్థలను సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం గల్ఫ్ సహకార మండలి-జీసీసీలోని ఆరు సభ్య దేశాల్లో కరోనా ఎఫెక్ట్ సౌదీ అరేబియాలోనే ఎక్కువగా కనిపిస్తోంది. సౌదీలో దాదాపు 2,795 పాజిటీవ్ కేసులు నమోదైతే..41 మంది మరణించారు. తాము ఇప్పుడు సమాజ భద్రత, దేశ ఆర్ధిక వ్యవస్థకు సంబంధించి ఓ నిర్ణయాత్మక సమయంలో ఉన్నామని, మహమ్మారి కరోనాను అరికట్టేందుకు తమ వంతు పాత్రను బాధ్యతగా నిర్వహిస్తామని సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే..వైరస్ తో పొంచి ఉన్న ప్రమాద తీవ్రత తెలియక కొందరు లాక్ డౌన్ కు విరుద్ధంగా రోడ్ల మీదకు వస్తున్నారని, గుంపులుగా పోగవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. రోడ్ల మీద కేవలం 50 శాతం మాత్రమే ట్రాఫిక్ తగ్గినట్లు తెలిపింది. దీంతో అవసరమైన ప్రాంతాల్లో 24 గంటల కర్ఫ్యూ అమలు చేస్తున్నామని కూడా వెల్లడించింది. కరోనాపై పోరాటంలో భాగంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు కింగ్ సల్మాన్ 7 బిలియన్ల రియాల్స్ విడుదల చేశారు. వైరస్ నియంత్రణ చర్యలు సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలు ఉండటంతో ఈ ఏడాది చివరి నాటి 32 బిలియన్ల రియాల్స్ వరకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?