టిసిఎస్ అద్భుత అవకాశం...

- April 08, 2020 , by Maagulf
టిసిఎస్ అద్భుత అవకాశం...

ఢిల్లీ:భారత దేశంలో ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ తర్వాత దేశంలోని పలు కంపెనీల విధివిధానాల్లో మార్పులు చేసుకునే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితిలో సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకోవడం అత్యవసరంగా మారింది. ఇందుకోసమే టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ఒక ఉచిత కోర్స్ అందిస్తున్నట్లు ప్రకటించింది. కేవలం 15 రోజుల్లో ఈ కోర్సు చేయవచ్చు. ఇప్పటికే కొంతమేరకు  ఐటి సంబంధిత ప్రతిభ ఉంటే ఈ కోర్స్ ద్వారా దాన్ని మరింతగా పెంచుకోవచ్చు. టాటా గ్రూప్ సంస్థ ఈ కోర్సును పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. ఈ  కోర్స్ సర్టిఫికెట్ తీసుకున్న తరువాత మంచి ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు.లాక్డౌన్ సమయంలో ఈ కోర్సును చేయవచ్చని  టిసిఎస్ తెలిపింది. విద్యార్థులు మొదలుకొని  ఉద్యోగార్థుల వరకు అందరూ ఈ కోర్స్ చేయవచ్చని సంస్థ  తెలిపింది. ఈ కోర్సును టిసిఎస్ అయాన్(TCS iON) ప్లాట్‌ఫారంలో అందుబాటులో ఉంచారు.కెరీర్ ఎడ్జ్(Career Edge) పేరిట ఈ కోర్స్ ను ప్రత్యేకంగా రూపొందించారు.మరిన్ని వివరాల కోసం ఈ క్రింద లింకుని క్లిక్ చెయ్యండి. https://www.tcsion.com/LX/login 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com