మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని ఎమోషనల్ ట్వీట్..!

- April 10, 2020 , by Maagulf
మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని ఎమోషనల్ ట్వీట్..!

భారత్.. హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి..సదరు మెడిసిన్ ను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది. దీంతో ప్రపంచ దేశాల నుంచి ఇండియాకు ప్రశంసలు లభిస్తున్నాయి. గురువారం అమెరికా, బ్రెజిల్‌ తో పాటు కొన్ని దేశాలు ప్రధాని మోదికి థాంక్స్ చెప్పగా..శుక్రవారం నాడు ఇజ్రాయెల్ కూడా ఈ జాబితాలో చేరింది. గురువారం హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఇజ్రాయెల్‌ కు పంపడంతో, ఆ దేశ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు.. మోదికి ధన్యావాదాలు తెలిపారు. ఇజ్రాయెల్‌కు క్లోరోక్విన్‌ పంపినందుకు భారత ప్రధాని, నా ఆప్త మిత్రుడు మోదీ కి థ్యాంక్స్. ఇజ్రాయెల్ ప్రజలంతా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. కరోనా వైరస్ విజృంభణ ప్రారంభమైనప్పటికీ నేను మోదీతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు. పరిస్థితులపై ఎప్పటికపుడు సమీక్షలు జరుపుతున్నాం అని నెతన్యాహు ట్వీట్‌ చేశారు.

నెతన్యాహు ట్వీట్ కు ప్రధాని మోదీ కూడా స్పందించారు. కరోనా వైరస్ పై మనం కలిసి పోరాడాలని మోదీ పిలుపునిచ్చారు. తన స్నేహితులకు సాయం చేయడానికి ఇండియా సిద్ధంగా ఉందన్నారు. ఇజ్రాయెల్ ప్రజలు హెల్తీగా ఉండాలని ప్రార్థిస్తున్నానని మోదీ ట్వీట్ చేశారు. భారత్‌కు ఇజ్రాయెల్ ఎంతో నమ్మకమైన మిత్ర దేశమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బెంజమిన్ నెతన్యాహూ మోదీ పట్ల తన గౌరవాన్ని ఎప్పుడూ చాటుతూనే ఉంటారు. మనం రక్షణ సాంకేతిక వ్యవహరాల్లో ఇజ్రాయెల్ అనేక విధాలుగా సహాయం అందిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com