సౌదీ పౌరులు తిరిగొచ్చే గడువుని పెంచిన ప్రభుత్వం

- April 10, 2020 , by Maagulf
సౌదీ పౌరులు తిరిగొచ్చే గడువుని పెంచిన ప్రభుత్వం

రియాద్‌: సౌదీ అరేబియాకి తిరిగొచ్చే పౌరులకు డెడ్‌లైన్‌ని ఏప్రిల్‌ 14 వరకు పొడిగించినట్లు ఫారిన్‌ మినిస్ట్రీ వెల్లడించింది. కింగ్‌ సల్మాన్‌ అలాగే క్రౌన్‌ ప్రిన్స్‌ ఆదేశాల మేరకు ఈ ఎక్స్‌టెన్షన్‌ చేసినట్లు ఫారిన్‌ మినిస్టర్‌ ప్రిన్స్‌ ఫైసల్‌ బిన్‌ ఫర్హాన్‌ చెప్పారు. దేశంలోకి తిరిగొచ్చేందుకోసం రిక్వెస్ట్స్‌ రిసీవింగ్‌ గడువు ఏప్రిల్‌ 14 మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు పొడిగించినట్లు ఫారిన్‌ మినిస్ట్రీ ఓ ట్వీట్‌ ద్వారా వెల్లడించింది. మినిస్ట్రీ ఆఫ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ అలాగే సంబంధిత శాఖలన్నీ కలిసి ఈ ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్‌ చేయనున్నాయి. పౌరులు క్షేమంగా దేశానికి వచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com