:నిర్బంధ గృహస్థాశ్రమం:
- April 11, 2020
:నిర్బంధ గృహస్థాశ్రమం:
--డా.కోడి రామ (అల్ అయిన్,యూ.ఏ.ఈ )
"శార్వరీ" మాతకు,"శారదా" మాతకు శత కోటి వందనాలు!
"బుధుడు: పరిపాలించు భువిలోన ,కటాక్షించిన,
కర్ఫ్యూ లేని "కరోన","కోవిడ్" పేర దివ్య నామామృతమయ్యె!
కలియుగ మహిమతో పుణ్యముపురుషులెల్ల
'రాజు','పేద' యను భేదమెరుంగక కంటికే కనపడని,
చేతికే దొరకని, ప్రాణాంతక మహమ్మారికి తల వొగ్గిరి!
నిత్య మరణ మృదంగమై, మన మధ్యలోనే,
మసులుతున్న అదృశ్య జీవి రేపో,మాపో
నీ అంతిమ యాత్రకు,"శ్రీకారం" అంటున్నది అంటువ్యాధి!
నేనే పాండెమిక్ అంటూ ప్రాణాలేహరిస్తున్నది:
"కార్యాలయం" వీడి "భార్యాలయ"మందే మనుగడ
సాగించు, మహానుభావులు, మరెందరో మాములు బాసులు ,
"కూపస్థమండూ కమ్ము",లై భార్యావిధేయులై, "గోవింద"
నామమే మరిచి "కోవిడ్" జపమాల పట్టారు!
అక్కటా ఏమి ఈమాయ!
రక్తపాతమెరుంగని జాగ్రన్మహాగ్ని, అహంకారమంతా
మొందింప అవతరించినదా?
విశ్వ సంగ్రామానికి నా దగ్గర క్షిపణలున్నాయి, అన్న,అన్న గారు, నాలుగు "మలేరియా"మాత్రలకోసం "దేహి"
అని పోషించటం వింతగా ఉంది కదూ!
"న్యూక్లియారు" బాంబులు నీనగరాలను కాపాడగలవా?
మనుజులందరు శవాల గుట్టగా మారిన,
నీ "శిధిల" సమాజానికి నీవురాజువేనయ్యా!
చేతులు కడిగి మూతులు కడిగి సబ్బులన్నీ అరిగిపోయాయి
నేనే గొప్ప వైద్యుడనాని గర్వించాను, నా చుట్టూ కోవిడ్
మంటలు చుట్టూ ముట్టి ఉన్నాయి!
"తీరెను రోజులు నీకీ కొమ్మకు" అన్నారు అలనాటిఘంటసాల
"పొమ్మా ఈ చోటు వదలి" అంటే ఎక్కడికి పోవాలి?
ఎందెందు వెదకినా అందదే కలదు మహమ్మారి "కరోనా"
కుచ్ కరోనా!
తాజా వార్తలు
- భారత్- పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత..
- సింహాచలం: మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు
- కోల్‌కతాలో విషాద ఘటన..14 మంది మృతి..
- దుబాయ్ అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్.. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం..!!
- ప్రపంచ ఆరోగ్య సర్వే 2025 ను ప్రారంభించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ..!!
- తుమామా స్టేడియం దగ్గర ఇంటర్చేంజ్ మూసివేత..!!
- ITEX 2025.. ఒమన్ కు ప్రాతినిధ్యం వహించే వారి వివరాలు వెల్లడి..!!
- 16 నకిలీ సోషల్ మీడియా ఖాతాలు.. నిందితుడి అరెస్టు..!!
- 2025 మొదటి 3 నెలల్లో.. 42 మిలియన్ల దిర్హామ్‌లకు పైగా ఫేక్ వస్తువులు సీజ్..!!
- ఇండియన్ ఎయిర్ స్పేస్ బంద్!